home TSPSC Sikander Jah from 1803 to 1829

Sikander Jah from 1803 to 1829

సికిందర్ జా (1803-1829)

నిజాం అలీఖాన్ మరణం (1803) తర్వాత హైదరాబాద్ రాజ్యానికి సికిందర్ జా రాజయ్యాడు. మూడో అసఫ్ జా బిరుదుతో ఇతడు రాజ్యానికి వచ్చాడు. ఇతడి కాలంలో గవర్నర్ జనరల్ ‘సైన్య సహకార సంధి’పై నైజాంతో మరోసారి సంతకం చేయించుకున్నాడు. సికిందర్ జా కాలంలో మీర్ ఆలం దివాన్‌గా, రాజా చందులాల్ పేష్కార్‌గా నియమితులయ్యారు.
మీర్ ఆలం హైదరాబాద్ – మద్రాస్, బొంబాయి రహదారులు మరమ్మతు చేయించాడు. 1808లో తన పేరు మీద మీర్ ఆలం చెరువును నిర్మించాడు.
1814లో విలియం పామర్ హైదరాబాద్‌లో పామర్ అండ్ కో బ్యాంకు ప్రారంభించాడు.
1811లో హైదరాబాద్‌లో బ్రిటిష్ ప్రతినిధిగా హెన్రీ రస్సల్ నియమితుడయ్యాడు. 1816లో హైదరాబాద్ రాజ్యంలో కల్లోల పరిస్థితులను చక్కదిద్దడానికి హెన్రీ రస్సల్ ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. ఈ సైన్యం సహాయంతో పిండారీలు, భిల్లులు, స్థానిక జమీందారుల తిరుగుబాటులను అణచివేసి హైదరాబాద్ రాజ్యంలో శాంతి నెలకొల్పారు. తర్వాతి కాలంలో రస్సల్‌కు సైన్యం నిర్వహణ భారంగా మారింది. ఆర్థిక సంక్షోభం వల్ల జీతాలు చెల్లించలేని పరిస్థితులు నెలకొనడంతో అతడు పామర్ కంపెనీ నుంచి అప్పు తీసుకున్నాడు. 1820లో హైదరాబాద్‌లో బ్రిటిష్ ప్రతినిధిగా మెట్కాఫ్ వచ్చాడు. ఇతడు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి పామర్ కంపెనీకి కట్టాల్సిన అప్పును నిజాం తీర్చేలా కృషి చేశాడు.
చార్లెస్ మెట్కాఫ్ కాలంలోనే కోఠిలోని రెసిడెంట్ (ప్రస్తుత మహిళా కళాశాల) భవనాన్ని నిర్మించారు.

TAGS:

kautilya

Kautilya Career Catalyst one stop solution to succeed in government jobs, Offering various courses for State and Central services includes Groups , Civil Services, Banking, Railways, Insurance. TSPSC, APPSC, UPSC,RRB,SSC,BANKING and INSURANCE.

Leave a Reply